Sunday, May 31, 2015

తోడి కోడళ్ళు : కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకొవే

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో నిజా నిజాలు

చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన
మేడ గట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలచి
కడుపుకాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో నిజా నిజాలు

గాలిలోన తేలిపొయే చీరగట్టిన చిన్నదాన
గాలిలోన తేలిపొయే చీరగట్టిన చిన్నదాన
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాకల బడుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చిరుగు పాకల బడుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో నిజా నిజాలు

No comments:

Post a Comment