Sunday, May 31, 2015

సింధూరం : హై రె హై జాంపండు రోయ్ హై రె హై జాంపండు రోయ్

హై రె హై జాంపండు రోయ్ హై రె హై జాంపండు రోయ్
కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా
ఏం రూపు రా ఏం రంగు ర ఏం రూపు రా ఏం రంగు ర
సొంత మైతె అంత కన్న నా అయ్య బాబోయ్
హై రె హై జాంపండు రోయ్ హై రె హై జాంపండు రోయ్
చూడగానె నోరూరె రా తీయగా
ఏం రూపు రా ఏం రంగు ర ఏం రూపు రా ఏం రంగు ర
సొంత మైతె అంత కన్న నా అయ్య బాబోయ్

అందమైన కోన సీమ కొబ్బరాకు లా
తెల్లవారి వెలుగు లోన తులసి మొక్క లా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతి లా
పెరుగులోన నంజుకున్న ఆవకాయ లా
బుట్ట బొమ్మ లా పాల పిట్ట లా గట్టు దాటు గోదారి లా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
హొయ్ తేనె చుక్క లా వాన చినుకులా మామ్మ గారి ముక్కు పుడక లా వుంది పిల్ల

పాత తెలుగు సినిమాలొ సావిత్రి లా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వె లా
తామరాకు వొంటి పైన నీటి బొట్టు లా
వాకిలంత నిండి వున్న రంగు ముగ్గులా
చేప పిల్ల లా చందమామ లా ముద్దు ముద్దు మల్లె మొగ్గ లా
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్ యెయెయె యె
ఒయి చెరుకు పంట లా భోగి మంట లా
పసుపు రంగు ఇంటి గడపలా వుంది పిల్ల 

అమ్మ రాజీనామా : ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం

ఎవరు రాయగలరూ
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ
అమ్మ అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగా
అమ్మేగ తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగ ఆది స్వరం
ప్రాణమనె పాటకి

ఎవరు రాయగలరు
అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
అమ్మ అను రాగం కన్న తీయని రాగం

అవతారమూర్తి అయినా
అణువంటె పుడతాడు
అమ్మ పేగు పంచుకునే
అంతవాడు అవుతాడు
అవతారమూర్తయినా అణువంటె పుడతాడు
అమ్మ పేగు పంచుకునె అంతవాడు అవుతాడు
అమ్మేగా.... అమ్మేగ చిరునామ ఎంతటి ఘన చరితకి
అమ్మేగ కనగలదు అంత గొప్ప అమ్మని

ఎవరు రాయగలరు
అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
అమ్మ అను రాగం కన్న తీయని రాగం

శ్రీరామ రక్ష అంటూ నీల్లుపోసి పెంచిందీ
ధీర్ఘాయురస్థు అంటూ నిత్యం దీవించిందీ
శ్రీరామ రక్ష అంటు నీల్లుపోసి పెంచింది
ధీర్ఘాయురస్థు అంటు నిత్యం దీవించింది
నూరేళ్లూ...నూరేళ్లు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతొ
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతొ


ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్న తీయని రాగం
అమ్మేగ తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగ ఆది స్వరం ప్రాణమనె పాటకి

ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్న తీయని రాగం మ్ మ్ 

మరోచరిత్ర : ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభంధ మౌనో
అప్పడి అన్నా ..అర్థం కాలేదా
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది..2
ఆహా..అప్పడియా..
పెద్ద అర్థమయినట్లు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది

ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

వయసే వయసును పలుకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్..నీ రొంబ..అళహాయిరుక్కే
ఆ....రొంబ....అంటే
ఎల్లలు ఏవీ ఒల్లలన్నది
నీదీ నాదోక లోకమన్నది
నీదీ నాదోక లోకమన్నది

ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

తొలిచూపే నను నిలవేసినది
మరుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు..అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునొ ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుభందమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో 

బన్ని : కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద

పల్లవి :

 కన బడలేదా గోదారి తల్లి కడుపుకోత
 వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష
 ॥
 గుండెనిండ పాలున్నా బిడ్డలకందించలేని
   తల్లిబతుకు దేనికనీ
 బీళ్లు నింపె నీళ్లున్నా సముద్రాన పడిపోయే
   శాపం తనకెందుకనీ
 బలువై దయకరువై తను వెలియై ఇక బలియై
 
 బృందం: 
బలువై దయకరువై
   తను వెలియై ఇక బలియై
 ఉప్పు సాగరాలలోకి వెళ్లలేక వెళ్లలేక
   వెక్కివెక్కి పడుతున్నది
   వృథా కథలు మోయలేక...
 ఆ అలల అలజడి ఆ తడి ఆరని కంటతడి
 ఆ అలల అలజడి తడి ఆరని కంటతడి
 కనబడలేదా వినబడడం లేదా
 ॥
 
 చరణం :

 శిలాపలకలేసి మీరు ఎలా మరచిపోయారని
 బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది
 దుర్మదాంధులార తెలుగు బిడ్డలకీ కర్మేందని
 ధర్మపురిలో నారసింహ నాదం చేస్తున్నది
 ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
 కాళేశ్వర శివలింగం కాళ్లు కడిగి ఏడ్చినది
 బతుకు మోయలేని
 
 రైతు ఆత్మహత్యలకు చలించి
 భద్రాచల రాముడి కి సాగిలపడి మొక్కినది
 పాపికొండల గుండె ధారై ప్రవహించినది
 ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది
 సిగ్గుపడండని కుటిల నాయకులను తిట్టినది
 గుండె పగిలి సరసాపూర్ సముద్రాన దూకినది

నాలుగు స్తంభాలాట : చినుకులా రాలి నదులుగా సాగి

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరచిపోబోకుమా... మమత నీవే సుమా ||చినుకులా||

చరణం 1

ఆకులు రాలి వేసవిగాలీ నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరె జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
శిశరమైనా... శిధిలమైనా...
విడిచిపోబోకుమా విరహమై పోకుమా

చరణం 2

తొలకరి కోసం తొడిమను నేనై
అల్లాడుతున్నానులే
పులకరమూదే పూవుల కోసం
వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నను నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసె
నీ ప్రేమ నా ప్రేమ తారాడే నా ప్రేమ
భువనమైనా... గగనమైనా...
ప్రేమమయమే సుమా... హా...
ప్రేమ మనమే సుమా... ||చినుకులా|| 

నాలుగు స్తంభాలాట : చినుకులా రాలి నదులుగా సాగి

చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరచిపోబోకుమా... మమత నీవే సుమా ||చినుకులా||

చరణం 1

ఆకులు రాలి వేసవిగాలీ నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరె జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీపేరే నా ప్రేమ
శిశరమైనా... శిధిలమైనా...
విడిచిపోబోకుమా విరహమై పోకుమా

చరణం 2

తొలకరి కోసం తొడిమను నేనై
అల్లాడుతున్నానులే
పులకరమూదే పూవుల కోసం
వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నను నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసె
నీ ప్రేమ నా ప్రేమ తారాడే నా ప్రేమ
భువనమైనా... గగనమైనా...
ప్రేమమయమే సుమా... హా...
ప్రేమ మనమే సుమా... ||చినుకులా|| 

రోజులు మారాయి : ఏరువాక సాగారో రన్నో చిన్నన్న

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కల్ల కపటం కానని వాడ
లోకం పోకడం తెలియని వాడ
కల్ల కపటం కానని వాడ
లోకం పోకడం తెలియని వాడ

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె
ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పోటేరును కరి జూచి పన్ను
కోయల పటదాపట ఎడ్ల దోల్నుతో
హై హై హై హై
రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు
వొళ్లు వంచి చాకిరికి మళ్లరు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పదవులు తిరమని బ్రమిసే వాళ్లే
కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్

రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న 

శ్రీ మంజునాథ : ఓం మహ ప్రాణదీపం శివం శివం

ఓం మహ ప్రాణదీపం శివం శివం
మహొకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహ దివ్య తేజం
భవానీ సమేతం భజె మంజునాథం

ఓ..ఓఓఓం....ఓఓఓం..ఓం...
నమఃశంకరాయచ మయస్కరాయచ
నమఃశివాయచ శివతరాయచ భవహరాయచ

మహ ప్రాణదీపం శివం శివం
భజె మంజునాథం శివం శివం

ఓం అద్వైథ భాస్కరం అర్ధనారీశ్వరం
హృదశ హృదయంగమం చతురధతిసంగమం
పంచ భూతాత్మకం శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరస మనోహరం
దశ దిశాసువిమలం
ఏకాదశోజ్వలం ఏకానాథేశ్వరం
ప్రస్థుశివశన్కరం ప్రణత జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
హారిభవ తారకం ప్రకృతి విభ తారకం
భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం

ఈశం సురేశం ఋషేశం పరేశం
నటేశం గౌరీశం గణేశం భూతేషం
మహా మధుర పంచాక్షరీ మంత్ర మాధ్యం మహ హర్ష
వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ

మహ ప్రాణదీపం శివం శివం
భజె మంజునాథం శివం శివం

ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢం ఢం ఢ
ఢక్కారి నాధ నవ తాండవాడంబరం
థధిమ్మి థకధిమ్మి ధిధిమ్మి ధిమిధిమ్మి సంగీత
సాహిత్య సుమ సమరమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం

రుగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం కామ ప్రగీతం అధర్మ
ప్రభాతం పురణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక శూత్రం విరుద్ధం సుసిద్ధం

న కారం మ కారం శి కారం బ కారం య కారం నిరాకార
సాకార సారం మహా కాల కాలం మహా నీలకంఠం
మహా నంద గంగం మహాట్టాట్టహాసం జఠా జూఠ రంగైక గంగా
సుచిత్రం జ్వల ఉగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశం మహా భాను లింగం.....
మహా వర్తృ వర్నం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహా కాలేశ్వరం
వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం భావ లింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం గ్రిశ్మేశ్వరం
త్ర్యమ్బకాధీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ కేదారలింగేశ్వరం
అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమత్మకం..
అనాదిం అమేయం అజేయం అచిన్త్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచిన్త్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థల క్షేత్ర వర పరం‍జ్యోతిం......
ధర్మస్థల క్షేత్ర వర పరం‍జ్యోతిం......
ధర్మస్థల క్షేత్ర వర పరం‍జ్యోతిం......

ఓం...... నమ సోమయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ
శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ
కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రిశాయచ
శర్వాయచ సర్వయా-చ.. 

ఏక్‍నిరంజన్ : అమ్మా లేదు నాన్నా లేడు

అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు "ఏక్‍నిరంజన్"
పిల్లా లేదు పెళ్ళీ లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసె మావా లేడు "ఏక్‍నిరంజన్"
ఊరే లేదు నాకొ పేరే లేదు, నీడా లేదు నాకె తోడూ లేదు
నేనెవరికి గుర్తే రానూ ఎక్కిల్లె రావసలే
నాకంటు ఎవరూ లేరే కన్నీళ్లె లేవులె
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరె
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరి వాడినే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు "ఏక్‍నిరంజన్"
పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్ళి చేసె మావా లేదు "ఏక్‍నిరంజన్"

కేర్ ఆఫ్ ప్లాట్‍ఫార్మ్ సన్ ఆఫ్ బాడ్ టైమ్ ఆవార డాట్ కాం
ఏ దమ్మారొదమ్ టన్స్ ఆఫ్ ఫ్రీడం మనకదేగ ప్రాబ్లం
అరే డేట్ ఆఫ్ బర్తె తెలియదే పెను గాలికి పెరిగాలే
ఏ జాలి జోల ఎరగనె నా గోలేదొ నాదె
తిన్నావ దమ్మేసావ అని అడిగేదెవ్వడు లే
ఉన్నావ పోయావ అని చుసేదిక్కే లేడే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరె
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరి వాడినే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు "ఏక్‍నిరంజన్"
తట్టా లేదు బుట్టా లేదు
బుట్ట కింద గుడ్డుపెట్టే పెట్టా లేదు "ఏక్‍నిరంజన్"

శ్తిల్ల్ ఃఇస్ భొద్య్ ఉల్ల్ ఓ ఈలిన్గ్ ణొ ఓనె ఈస్ ఛరిన్గ్
ఠత్స్ ఓక్ యార్ చల్త హై నేనే నా డార్లింగ్
ఏ కాక ఛాయె అమ్మ లా నను లేరా అంటుంది
ఓ గుక్కెడు రమ్మె కమ్మగా నను పడుకో పెడుతుందీ
రోజంత నాతో నేనె కల్లోను నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనె తేడాలె లేనె లేదే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరె
ఇరగేసినా తిరగేసినా నేనేప్పుడు ఎహె ఒంటరి వాడినే
అమ్మా లేదు నాన్నా లేడు అక్కా చెల్లి తంబీ లేరు "ఏక్‍నిరంజన్"
కిస్సూ లేదు మిస్సూ లేదు
కస్సు బుస్సు లాడె లస్కు లేదు "ఏక్‍నిరంజన్"  

పరుగు : హృదయం ఓర్చుకొలేనిదీ గాయం

హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాక
నిలువవె కడదాకా
జీవంలో ఒదగవె ఒంటరిగా
లో లో ముగిసె మౌనంగా
ఓ ఓ ఔ ఔ ఔ
ఓ ఓ ఔ ఔ ఔ
హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

ఊహలలోకంలొ ఎగరకు అన్నావే
తేలని మైకంలొ పడగని ఆపవే
ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావె ప్రేమా
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలికాంతి నీవు
మలి కోరు పంతానీవు
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి
ఔ ఔ ఔ ఔ ఔ
రారరి రారరి రారరి
హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగ వెలిగె సురీడూ
చల్లని చూపులతొ దీవెనలిస్తాడూ
అంతటి దూరం వుంటే బ్రతికించె వరమౌతాడూ
చెంతకి చేరాడంటే చితి మంటె అవుతాడూ
హలాహలం నాకు సొంతం
నువ్వు తీసుకొ అమృతం
అనకుంటె ఆ ప్రేమె ప్రేమ కాగలద
ఓ ఓ ఓ ఓ ఓ
హృదయం ఓర్చుకొలేనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

గమ్యం : ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండెనడుగు

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిల ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ

సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటూ
అది నీ ఊపిరిలో లేదా
గాలివెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇస్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి బాష్యం
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

తోడి కోడళ్ళు : కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపొతే
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకొవే

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో నిజా నిజాలు

చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన
చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన
మేడ గట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపుకాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలచి
కడుపుకాలే కష్ట జీవులు ఒడలు విరిచి గనులు తొలచి
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో నిజా నిజాలు

గాలిలోన తేలిపొయే చీరగట్టిన చిన్నదాన
గాలిలోన తేలిపొయే చీరగట్టిన చిన్నదాన
జిలుగువెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాకల బడుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చిరుగు పాకల బడుగు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో

కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో నిజా నిజాలు

ప్రాణ స్నేహితులు : స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా

స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా
కడదాక నీడలాగా నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా....
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికాదన్నా
మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధి రా
ఆ స్నేహమే నీ ఆస్థి రా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా
కడదాక నీడలాగా నిను వీడి పోదురా


త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం
ప్రాణనికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహము రా
ధ్రువ తారగా స్థిరమైనది ఈ జగతిలో విలువైనదీ ఈ స్నేహమొకటేనురా

స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా
కడదాక నీడలాగా నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది..నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా....
స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా

అంకురం : ఎవరో ఒకరు... ఎపుడో అపుడు

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది ..

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

కదలరు ఎవ్వరూ ...వేకువ వచ్చినా
అనుకొని కోడి కూత నిదరపోదుగా..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి..

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..
దానికి లెక్క లేదు కాళరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలి చూపి తీరమే దరికి చేరునా..?

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......

యుగములు సాగిన... నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండకే ఒళ్ళు మండితే.. అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా?..
నల్ల మబ్బు కమ్మితే చల్లబడడా..?

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు......



Evaro Okaru...Yepudo Apudu
Evaro Okaru....Yepudo Apudu
Nadavara Mundhuga..Ato Ito Yeto Vaipu....!
Ato Ito Yeto Vaipu...

Aaa.Aaa...Modhati Vaadu Eppudu Okkade Mari
Modhati Adugu Yeppudu Ontare Mari
Venukavacchu Vaallaku Baata Ayinadhi
Evaro Okaru Epudo Apudu
Nadavara Mundhuga Ato Ito Yeto Vaipu..Ato Iti Yeto Vaipu...

Kadhalaru Evvaru Vekuva Vacchina...
Anukuni Kodi Kootha Nidarapodhuga...
Jagathiki Melukolpu maanukodhuga
Modati chinuku sootiga dhooki raanidhe
Mabbu kongu chaatuga Odhigi daagithe
vaana dhaara raadhuga nela daariki
praanamantu ledhuga brathakadaniki

Yevaro Okaru...Yepudo Apudu
Evaro Okaru....Yepudo Apudu
Nadavara Mundhuga..Ato Ito Yeto Vaipu....!
Ato Ito Yeto Vaipu...

Chedharaka podhuga chikkani cheekati
Minuguru rekka chaatu chinni kaanthiki
daaniki lekka ledhu kaala raathiri
Pedhavi pramidha nilapani navvu jyothini
reppa venaka aapani kanti neetini
saagaleka aagithe daari taruguna..
jaali choopi teerame dariki cheruna

Evaro Okaru...Yepudo Apudu
Evaro Okaru....Yepudo Apudu
Nadavara Mundhuga..Ato Ito Yeto Vaipu....!
Ato Ito Yeto Vaipu...

Yugamulu saagina ningini thaakaka..
Yegasina alala aasha alisipodhugaa..
Otami oppukuntu aagipodhuga
Yentha vedi Yendatho Ollu mandithe
Antha vaadi aavirai velli cheradha
Antha goppa suryudu kallu mooyada
Nalla mabbu kammithe challa baarada

Evaro Okaru...Yepudo Apudu
Evaro Okaru....Yepudo Apudu
Nadavara Mundhuga..Ato Ito Yeto Vaipu....!
Ato Ito Yeto Vaipu..

పెళ్ళి పుస్తకం : శ్రీరస్తు శుభమస్తు

శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీరస్తు శుభమస్తు

తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం

శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు

అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో

ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం 

సాగర సంగమం : వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నలు దోచాడే
ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేనివాడే కన్నె తోడు వున్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్ధ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నలు దోచాడే
అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నలు దోచాడే
ఆ అహహ వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

సీతాకోకచిలుక : మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా

తందనాన......తందానాననాన
తందానాననాన తందానాననాన ఆ.....
తందనాన ఆ....తందనాన...ఆ....(2)
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా (మిన్నేటి)

అందమైన రంగవల్లులై
ఎండలన్ని పూల జల్లులై
ముద్దుకే పొద్దు పొడిచి(మిన్నేటి)

ఓ...చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాలా జంట పేరంటాలా
ఓఓ....చుక్కా నవ్వవే
నావకు చుక్కానవ్వవే
పొందు ఆరాటాలా పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే బులపాటాలా
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా (మిన్నేటి)

ఊ....ఆ....ఆ...ఆ..ఆ
ఓఓ.....రామచిలకా
చిక్కని ప్రేమ మొలకా
గూడు ఏమైందమ్మా ఈడు ఏమైందమ్మా
ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
తోడు ఉండిపోవే కంటి నీరింకా
పువ్వు నుంచి నవ్వులు
తుంచ లేరులే ఇంకా
మిన్నేటి సూరీడు....
లా...లా...లా...లా
మిన్నేటి సూరీడు.....
లా...లా....లా...లా....
మిన్నేటి సూరీడు.....
లా....లా....లా...లా....
లాలాలాలా లాలా.....

సింధూరం : అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్రం అందామా

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!

తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!

నిప్పులాంటిమనిషి : స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

అల్లాయే దిగి వచ్చి
అల్లాయే దిగి వచ్చి
ఆయ్ మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దూ...
పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను
ఒక్క నేస్తం కావాలంటాను

పల్లవి :
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
స్నేహమే హోయ్...
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

చరణం : ౧

గుండెనే పలికించితే
గుండెనే పలికించితే
కోటి పాటలు పలుకుతాయ్
మమతనే పండించితే
మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ...
లేదు అంతకు మించి హాయి
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

చరణం : ౨

కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటో ఈ బాధ
ఏమిటో ఈ బాధ
నాకైనా చెప్పు భాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి
చుక్కలను కోసుకుని తెమ్మంటావా
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా
దింపమంటావా
ఆ చంద్రుణ్ణి
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను
దోస్తీకి నజరానా
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న
ఒక నవ్వేచాలు వద్దులే వరహాలు నవ్వరా...
నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు రంజాను పండుగా

స్నేహమే హోయ్...
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం

ప్రాణం ఖరీదు : యాతమేసి తోడినా ఏరు ఎండదు

పల్లవి:

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా
పూరి గుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు
ఆ దీపముండదు ||యాతమేసి||

చరణం : ౧

పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా
అది పాలు కుడుపుతాది
కడుపుకోత కోసినా
అది మనిషికే జన్మ ఇత్తాది
బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో ||యాతమేసి||

చరణం : ౨

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా
సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటే
వల్లకాడు ఒక్కటే
కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా ||యాతమేసి||

విప్రనారాయణ : ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం

Movie : Vipranarayana(విప్రనారాయణ) (1954)
Cast : ANR, Bhanumathi
Music : Saluri Rajeswara Rao
Director : P S Ramakrishna Rao
Song Lyric: Adadi ante layam layam aa needantene bhayam bhayam


కొంపకునిప్పంటుకుంటే పైకప్పేకాలిపోతుంది
హరిదాసులను ఆడది అంటుకుంటే బ్రతుకే కూలిపోతుంది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
ముక్కుమూసుకుని యోగంపట్టే మునిరాయెళ్ళకి ప్రణయం
ముక్కుమూసుకుని యోగంపట్టే మునిరాయెళ్ళకి ప్రణయం
హరుడంతటి బల్మగవాడ్నే హరుడంతటి బల్మగవాడ్నే ఆటాడించిందాడది ఓ ఆటాడించిందాడది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
కల్లా కపటం రెండూకళ్ళు కళ్ళు భ్రమించే వళ్ళు
కల్లా కపటం రెండూకళ్ళు కళ్ళు భ్రమించే వళ్ళు
కాదయ్యో ఓ
కాదయ్యో పులిహోర పొంగలి గరళపుముద్దే ఆడాది
కాదయ్యో పులిహోర పొంగలి గరళపుముద్దే ఆడాది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం