Sunday, June 1, 2014

ఎదుటా నీవే ఎదలోనా నీవే - Abhinandana


ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

ఎదుటా నీవే ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం
అందుకె ఈ గాయం
గాయన్నైనా మాన నీవు
హృదయాన్నైనా వీడి పోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాణ్ణి కాలేను

ఒహొహో..ఒహొహో..ఉహు..హు..హు..హు

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

ఎదుటా నీవే ఎదలోన నీవే

కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతె క్షణికాలేగా
సత్యాలన్ని నరకాలేగ
స్వప్నం సత్యమైతె వింత
సత్యం స్వప్నం అయ్యెదుంద
ప్రేమకింత బలముందా

అహహహా..ఒహొహో..ఉహు..హు..హు..హు

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

అదే నీవు అదే నేను - Abhinandana


అదే నీవు అదే నేను
అదే గీతం పాడనా
అనుపల్లవి కధైనా కలైనా కనులలో చూడనా

కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము
గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతము ఏదీ లేని గానము

నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశ గా
అదే బాసగా అదే ఆశ గా
ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను

మంచు కురిసే వేళలో - Abhinandana


మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో

నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో

మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుదో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో

ప్రేమ ఎంత మధురం - Abhinandana


ప్రేమ ఎంత మధురం
ప్రియురాలు అంత కఠినం
అనుపల్లవి చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం
మింగినాను హలాహలం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నా లోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము

నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి
నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానము

ప్రేమ లేదని ప్రేమించరాదని - Abhinandana


లలలలల లలలలలాలలా
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు

ప్రేమ

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికయినా కన్నీరుందని
వలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలపు తట్టి చెప్పని
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
ఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ

ప్రేమ

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడా చేయలెని వెర్రి వాడని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ

రంగులలో కలవో - Abhinandana


రంగులలో కలవో యద పొంగులలో కళవో (2)
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఉయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో (2)
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో (2)
మధుని బాణమో మదుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊగించనా
రంగులలో కలనై

ముంతాజు అందాల దానివో (2)
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో (2)
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో
రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై

కాకినాడ కాజా కాజా - Aata


కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే ||కాకినాడ||
కోటప్ప కొండపై పేరంటం
సింహాద్రి గుట్టపై సాయంత్రం
వెంకన్న కరుణతో కళ్యాణం మనదేలే
సిద్దాంతి పెట్టిన సుముహుర్తం
పెద్దోళ్ళు చెప్పిన సిద్దాంత
సిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే
లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే ||2||కాకినాడ||

చిన్నగుండెనే నీకు బండ చెయ్యనా
చిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనా
కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా
తాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనా
ఓ నీభామ చర్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం
బ్రహ్మండమైన పరమానందం మనదేలే ||లగ్గులాహిరే||కాకినాడ||

మల్లెపూలతో ఓ మాట చెప్పనా
పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లుమంటూ ఏడవొద్దని
వెండి మువ్వతో నే విన్నవించనా
వేడిపుట్టి అల్లుకుంటే ఘల్లు ఘల్లుమంటూ
గుట్టు బైటపెట్టవొద్దని
పడకింట నిండగా నిశ్శబ్దం
పెదవుల్లో పొంగగా కిశ్శబ్దం
అటుపైన జరిగిన అణూయుద్ధం మనదేలే ||లగ్గులాహిరే||

చూడొద్దే నను చూడొద్దే - Aaru


చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

వద్దూవద్దంటు నేనున్న వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటు నేనున్న పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్నా హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

వద్దూవద్దంటు నువ్వున్న వలపే పుట్టింది నీ పైనా
కాదుకాదంటు నువ్వున్న కడలే పొంగింది నా లోనా
కన్నీళ్ళ తీరం లో పడవల్లే నిలుచున్నా
సుడిగుండాల శృతి లయలో పిలుపే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగును లే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే
చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు
వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు మది గూడు దాటి వదిలెళ్ళొద్దు
అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీదేలే

హ్రుదయం అను లొకంలొ - Aaru



హ్రుదయం అను లొకంలొ ప్రెమ అను దెశం లొ
స్వప్నం అను నగరంలొ నా చెంత చెర వచ్చావె
వయసు అను గగనంలొ మనసు అను మెఘం లొ
చిరు ఆశల వర్షం లొ నన్ను గుచ్చి గుచ్చి తడిపావె
నా అణువు అణువు నీవెలె నీ తనువు తనువు
నాదెలె ప్రతి క్షణము క్షణము మందెలె ఒహ్ చెలి

హా వెన్నెలె వల విసిరి నీ కౌగిట్లొ అల్లిపొత
మెరుపుల మెడ వంచి నీ మెడలొ గొలుసెస్తా
చుక్కలు అన్ని చీపలు చెసి నీకె కమ్మని
విందిస్తా
మబ్బుని దించి సబ్బుగ మార్చి నీకె స్నానం
చెయిస్తా...........

B – O – Y BOY
Boy అంటె అబ్బాయి ,G – I – R – L GIRL
Girl అంటె అమ్మాయి ,this girl is hot that will make him crazy
And they r jus gonna rock so take it easy
వెళ్ళిదారి మదనా touching touching
అర్రె anytime anywhere kissing kissing

కలకి రెఖ ఒక్కటి నీ కౌగిట అల్లిపొత
పువ్వులనప్పడిగి పువ్వు రెకుతొ చీర చుడత
అకశన్నె చాపై చుట్టి నీకె పరుపై పరిచెస్త
సుర్యుడినె ఒహ్హ్ గుడుతొ చంపి పొద్దె పొడవని
ముద్దిస్థా..........

B – O – Y BOY
Boy అంటె అబ్బాయి ,G – I – R – L GIRL
Girl అంటె అమ్మాయి ,this girl is hot that will make him crazy
And they r jus gonna rock so take it easy
Posted by keerthika karlapudi at 7/02/2010 0 com

ప్రాణం లో ప్రాణంగా - Andhrudu


ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా
మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా
ఇలా ఇలా నిరాశగా
నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా

స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే
కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే
తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే
ఎడారి లొ తుఫాను లొ
తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా

ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ
మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే
గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,
స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక - Andhrudu



ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా

అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ
అనుకోని అతిధిని పొమ్మంటు తరిమే అధికారం లేదమ్మా

స్వార్ధంలేని త్యాగాలనే చెసేది ఈ ప్రేమ
త్యాగంలోనా ఆనందాన్నే చూసేది ఈ ప్రేమ
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపొయే వీలే లేదమ్మా

నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన
ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నడిపిందీ ప్రేమా

దేవతలారా రండి మీ దీవేనేలందించండి - Ahvanam




దేవతలారా రండి మీ దీవేనేలందించండి
నోచిన నోములో పండించే నా తోడుని పంపించండి
కలలో ఇల్లలో యే కన్యకి
ఇల్లంటి పతిరాడనపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కని విని ఎరుగని వేడుకతో వివహం జరిపించాలండి

కలలొ

మ్మ్మ్...ఒ....
శివ పార్వతులెమ్మో ఈ దంపతులనిపించలి
ప్రతి సంసారంలో నుమా కధలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీ కంతుల కోలువంటె మా కాపురం అనిపించాలి
మా ముంగిలిలోన పున్నమి పూల వేన్నేల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి

కలలొ

ఆ..ఆ..ఆ..ఆ..
తన ఎదపై రతనంల నిన్ను నిలిపే మోగుడోస్తాడు
నీ వగలే నగలంటు గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళ తేచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వేల్లుగిచ్చే మని దీపం నీవ్వంటాడు
ఈ పుత్తడి బోమ్మ మేతని పాదం మోపిన ప్రతిచోట
నిధినిక్షేపాలు నిధురలేచ్చి ఏధురోచ్చేనంట

కలలొ
దెవతలారా

పందిరి వేసిన ఆకశనికి ఇవమ్మ ఆహ్వనం - Ahvanam




పందిరి వేసిన ఆకశనికి ఇవమ్మ ఆహ్వనం
పీటను వేసిన ఈ నేలమ్మకు ఇవమ్మ ఆహ్వనం
నువ్వు రామ్మ ఓ వేధమ
విడకుల పత్రిక అందుకున్ని జంటనే వేరు చేయుమ్మ్మ
దంపతుల్లు విడదిసే మంత్రం కోతగ నేర్చుకో వమ్మ్మ

పందిరి వెసిన

ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిబడు తున్న
అ మాటే నిజమైతే ఈ చట్టం విడ గోడుతుంద
నీ రాతకు ఇంత సత్యం ఉందో చూతుము బ్రహ్మైయ
నీ సక్షం యేంత విల్లువైందో ఓ అగ్ని చూడైయ
నువ్వు రామ్మ ఓ అరుందతి
ఇదే నీ దర్షన బలం ఐతే యేట్టైన దాగి పోవమ్మ
నిజం గ పేల్లికి బలం ఉంటే చూటిగి యిటు దిగిరావమ్మ

పందిరి వెసిన

చితి మంటల సహగమనం ఓకసారే బలి చేస్తుంది
పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
అ జ్వాలలలో తోనే జీవించేటి ధైర్యం అంధిస్తు
ఓ బంధువులార ధీవించండి దీర్గసహనమస్తు
నువ్వు రామ్మ మాంగల్యమ
వివహకు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేల్లకి
విడాకుల వేడుకలో నేడు తేంపడం నేర్పడానికి

పందిరి వెసిన

ఒక్కడై రావటం ఒక్కడై పోవటం - Aa Naluguru



ఒక్కడై రావటం ఒక్కడై పోవటం, నడుమ ఈ నాటకం విధి లీల
వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుధి వేల
మరణమనేధీ ఖాయమని మిగిలేను తీపి గాయమని
నీ బరువు నీ పరువు మొసెధి.....ఆఆ నలుగురు

రాజని పేధని మంచని చెడ్ద్డాని భేధమఏ ఎరుగని యామ పాశం
కోట్ల ఈశ్వర్యము కటిక దారిద్ర్యము హద్ధులఏ చెరిపేనే బహుధూరం
మూటలలోని మూల ధనం చేయదు నేడు సహగమనం
మన వెంట కదా గంట నదిచెధి...ఆఆ నలుగురు

నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువనే శిలువగా మోసావు
అంధారు సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు
బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఉరటాగా
అభిమానం అనురాగం చాతెధి...ఆఆ నలుగురు

పోయిరా నేస్తామ పోయిరా ప్రియతమ నువ్వు మా గుండెలో నిలిచావు
ఆత్మాయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా కలకాలం
నాలుగు నేడు పదుగురు గా ఆ పదుగురు వేలు వందాలు గా
నీ వెనుకే అనుచరులై నదిచారు...ఆఆ నలుగురు

ఏదిక్కున నువ్వున్నా - Yuvasena



ఏదిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేదీ లేదు సుమా..!
పొంగే అలవొస్తే తలవంచాలి
వయసూ అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నాడి రాగా ||ఏదిక్కున||

చరణం 1

గిరులే వణికే జలపాతంలో జోరు
నీలో చూశా బంగారూ
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు
అలలై ఎగసే ఎదహోరు
వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి
వయ్యారి ఒంటికి పూసిందెవరు..?

చరణం 2

మధువే తొణికే అధరం మధుకలసం
మౌనం కూడా ప్రియమంత్రం
అపుడూ అపుడూ తెగి పడనీ ఒక ముత్యం
వెనకే తిరిగా ప్రతినిత్యం
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి
నాలోని తలపులే స్వరాలు చేసి
నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి... ||ఏదిక్కున||

మల్లీశ్వరివే మధురాశల మంజరివే - Yuvasena


Watch on watch on Watch On
Watch this dup dup dup style
I'am gonna dip dip dip it
in to your Smile
Hold me baby just hold my hand
forever and ever
Every time I Wanna see you my girl

పల్లవి

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నల నువ్వో వెండి మంటవో
తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే
చురకత్తుల చూపులున్నా ||మల్లీశ్వరివే||

చరణం 1

నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో
వేవేల తారకలే జలకమాడుతున్నవో
నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో కెంజాయి సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో
చూపుతోందె సోయగమా!
Baby don't you ever leave
I'm your don raja
Come on any time U're my dilruba
I can never stop this feeling
I'm U're don raja
Yeah... Hey... Hey... ||మల్లీశ్వరివే||
Baby run your body with this
freaky thin and I Won't let u go
and I Won't let u down
through the fire the limit
to the wall? Just to be with U I'm
gladly risk it all
ha, let me do it one more time
do it one more time
ha baby, come on and
lets get it into the party

చరణం 2

కొల్లేటి సరస్సులో తుళ్ళేటి చేపలై
రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవే
వదలదే హృదయం కదలదే నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము
తెలుపవె సౌందర్యమా... ||మల్లీశ్వరివే||

దూరం దూరం దూరం - 100% Love




దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..
ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా.. చెరో ప్రపంచం చేరినారే!
ఒకే గతాన్ని..ఓఓ.. ఒకే నిజాన్ని.. ఉరేసినారే! ఓఓఓ..
చెరో సగాన్ని.. ఓఓ.. మరో జగాన్ని.. వరించినారే! ఓఓఓ..

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..

ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం.. ఎంత కాలమో దారిలేని దూరం..
జంట మధ్య దూరి వేరు చేసే.. దారే నాదే అన్నాదే..
ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం.. చుట్టమంటు లేని మంటతోనే దూరం..
బంధనాలు తెంచుతూ.. ఇలా..భలేగ మురిసే..
ఎడబాటులోని చేదు తింటు దూరం.. ఎదుగుతున్నదే..
విరహాన చిమ్మ చీకటింట దూరం.. వెలుగుతున్నదే.. ఓఓఓ

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..

ఒక్క అడుగూ వెయ్యలేని దూరం.. ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం..
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే..
మైలు రాయికొక్క మాట మార్చు దూరం.. మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం..
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే..
తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే.. దూరమన్నదీ..
మొదలైన చోటు మరిచిపోతె కాదే.. పయనమన్నదీ.. ఓఓఓఓ

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..

తిరు తిరు గణనాధ - 100% Love



తిరు తిరు గణనాధ ది ది ది తై
తిరు తిరు గణనాధ ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాధ ది ది ది తై
నీ వెలుగు పంచు ఆ ప్రెమిదిలోన కొలువై
తిరు తిరు గణనాథ ది ది ది తై
తిరు తిరు గణనాథ ది ది ది తై

ససనిసగస సగమ
మమగమపమ మపని
పపమపనిస స ని అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ

చెవులారా వింటూనే ఎంత పాటమైన
easy గా తలకెక్కే itune ఇవ్వు
కనులార చదివింది ఒకసారే అయినా
కల్లోని మరచిపోని memory ఇవ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవానిదేదైనా choice లో పోనివ్వు
ఒకొక్క దండానికి ఒక్కో mark పడనివ్వు
ఏ tension దరికిరాని ఏకాగ్రత నాకివ్వు
answer sheet పైన ఆగిపోని pen ఇవ్వు

తిరు తిరు గణనాధ ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాధ ది ది ది తై
తిరు తిరు గణనాధ ది ది ది తై
తలస్నానం చేయకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపూ తో పాటే చదివింది తుర్రుమంటు washai అయిపోతుందని నా sentimentu
తలనే మార్చే తండ్రిగారి కొడుకు మీరు
మీరు తలచుకుంటే మా తలరాతలు తారుమారు
భారతం రాసిన చేత్తో బతుకుని దిద్దేయ్ బంగారు
పేపర్ లో ఫోటోలు, రాంక్లెవ్వరు అడిగారు
పాస్ మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తిరు తిరు గణనాధ ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాధ ది ది ది తై
తిరు తిరు గణనాధ ది ది ది తై

కళ్లు కళ్లు ప్లస్సూ - 100% Love



పల్లవి :
కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

అనుపల్లవి :
ఎడమభుజము కుడిభుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
॥కళ్లు॥
ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్...

చరణం : 1
దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ...
పైకి విసిరినది కింద పడును
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

చరణం : 2
సౌత్ పోల్ అబ్బాయంట
నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట
ఋణావేశ ం అమ్మాయంట
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంట... ఓ...
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట
॥కళ్లు॥

ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్ - 100% Love


ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్
టూ బాడ్ ఒంటికేమో బద్దకం ఇచ్చావ్
ఓ గాడ్ మిలియన్ డాలర్ల సిలబస్ ఇచ్చావ్
టూ బ్యాడ్ మిల్లీ గ్రాం బ్రెయినే ఇచ్చావ్
ఓ గాడ్ ఒన్ డే మ్యాచే ఇచ్చావ్
టూ బ్యాడ్ సేం డే ఎక్జాం ఇచ్చావ్
ఓ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్లు గా ఇచ్చావ్
టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్ల గా ఇచ్చావ్
తల తిప్పలేనన్ని అందాల్ ఇచ్చావ్
తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
డబుల్ గేంసేంటి మాతో నీకే
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయ్ల్యూర్ కే

ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా

మెమరీ కార్డ్ సైజేమో చోటి
మెమరీ స్టేటస్ కోటి
మిల్లీగ్రాం బ్రెయినైతే ఏంటీ
మిరకిల్స్ చెయ్ దాంతోటి
బాత్రూంలో పాటలకి బదులు
ఫార్ములానే పాడు
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం
స్వాతీ బుక్కే చూడూ
అబ్బబ్బ ఎం చెప్పేడ్రా
అహో బాలూ ఒహో బాలూ
అంకెలు మొత్తం వందలు వేలు
విడవని చోటే మొదలు

అహో బాలూ ఒహో బాలూ
ఎ టు జెడ్ అని చదివే బదులు
బి టు యు అంటే చాలు
బల్బ్ ని కనిపెడదాం అనుకున్నామూ
ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నామూ
ఆ గ్రహంబెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడూ
ఆస్కార్ పని పడదాం అనుకున్నామూ
కాని రెహ్మాన్ దాన్ని ఓడిసి పట్టేసాడు
అట్లీస్ట్ ఫస్ట్ రాంక్ కొడదాం అనుకున్నమూ
కాని బాలుగాడు దాని కోసం పుట్టేసాడు
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా

బల్బ్ ని కనిపెట్టిన ఎడిసన్ మరి
చదువుకు కనిపెట్టాడా మెడిసిన్
టెలిఫోన్ తో స్టాప్ అని అనుకుంటే
స్టార్ట్ అయ్యి ఉండేదా సెల్ ఫోన్
ఇంతే చాలు అనుకుంటూ పొతే
ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటితో సరి పెట్టుకుంటే
నేటికి లేదు టుమారో

అబ్బబ్బ ఎం చెప్పేడ్రా
అహో బాలూ ఒహో బాలూ
బాలు కందని లాజిక్ లన్ని
కావా నవ్వుల పాలు
అహో బాలూ ఒహో బాలూ
అనుకోడెపుడూ ఇంతే చాలు
ఈడి మైండ్ రేసులో గుర్రం కాలు
లక్ ఉన్నోళ్ళకి రాంకులు ఇచ్చావ్
నోట్లున్నోళ్ళకి స్లిప్పులు ఇచ్చావ్
అట్లీస్ట్ అమ్మాయిల కి అందాన్నిచ్చావ్
మమ్మల్నేమో నిండా ముంచావ్
బ్రిల్లియంట్ స్టుడెంట్స్ కి ఎ గ్రేడ్ అంటా
యావెరేజి స్టుడెంట్స్ కి బి గ్రేడ్ అంటా
మమ్మల్నేమో డి గ్రేడ్ చేస్తావ్
క్యాస్ట్ లు మతాలు వద్దంటూనే
గ్రేడ్ లతో విడదీస్తుంటావ్

ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా
ఊహ్ ఎలా ఎలా ఎలా

హే చెట్టుకి పూత కాయ పండని
మూడు రకలుగా చూస్తాం
పూతై పూసి కాయై కాసి
పండైతేనే విలువిస్తాం
గ్రేడ్ అంటె ఏబిసి బళ్ళో
బ్రైనుని కొలిచే స్టిక్కు
కాంపిటిషన్ లేదంటే రేసులో
గెలుపుకు ఉందా కిక్కూ

అబ్బబ్బ ఏం చెప్పేడ్రా
అహో బాలూ ఒహో బాలూ
నెంబర్ వన్ను కి రొటీన్ బాలు
చదువు కి రోటీన్ బాలు

అహో బాలూ ఒహో బాలూ
సెటిలేదైనా సెంటర్ బాలు
క్వశ్చన్ ఏంటైనా ఆన్సర్ బాలు

బాలు చదివిన బుక్ అంతా
వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్స్ అంతా
వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలూ వాడిన పెన్నంటా
ఆయుధ పూజలు చేద్దాం
బాలూ నడిచిన బాటంటా
అందరు ఫాలో అయిపోదాం

A square B square - 100% Love



A square B square A plus B whole square
టాం అండ్ జెర్రి వారుకి ఎటెమైనా డోంట్ కేర్
అటాక్ అటాక్ ఎలుక పిల్లిమీదకే
అటాక్ అటాక్ పువ్వు ముళ్లుమీదకే
అటాక్ అటాక ఉప్పు నిప్పుమీదకే
అటాక్ అటాక్

రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్
తింగర తింగర థీరంస్ కి పట్టె సొల్యూషన్స్
ఏ పోటా పోటి చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకులకోసం కాంపుటీషన్

అటాక్ అటాక్ చేప కప్పమీదకే
అటాక్ అటాక్ జింక పులిమీదకే
అటాక్ అటాక్ ఓణి జీన్స్ మీదకే
అటాక్ అటాక్