Friday, August 14, 2015

లే లే బాబా నిదురలేవయ్యా

లే లే బాబా నిదురలేవయ్యా

ఏలే స్వామీ మేలుకోవయ్య

రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా

ఏలే స్వామీ మేలుకోవయ్యా


వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టి

వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టి

పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని

ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ

పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి

అందుకనె గుండె నీ గురు పీఠమయినది

ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది

అంతకుమించిన భాగ్యమేదిరా బాబా

లే లే బాబా నిదురలేవయ్యా

ఏలే స్వామీ మేలుకోవయ్యా

రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

లే లే బాబా నిదురలేవయ్యా

ఏలే స్వామీ మేలుకోవయ్యా


నీలకంఠ స్వామిలొ నిండుకున్న జ్యోతివై

సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై

లోకములు కాచే తండ్రివి నీవేనని

రూపముల ఆనేకములయిన శ్రీ సాయిని

నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై

కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై

వెన్నంటి నువ్వుంటే లోటె లేదుగా బాబా

లే లే బాబా నిదురలేవయ్యా

ఏలే స్వామీ మేలుకోవయ్యా

రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

లే లే బాబా నిదురలేవయ్యా

ఏలే స్వామీ మేలుకోవయ్యా

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధిలీల

వెంట ఏ బంధమూ రక్త సంబంధమూ తోడుగా రాదుగా తుదివేళ

మరణమనేది ఖాయమనీ మిగిలెను కీర్తి కాయమనీ

నీ బరువూ నీ పరువూ మోసేదీ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ


నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోశావూ

అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావూ

నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా

నీ వెనకే అనుచరులై నడిచారూ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ


పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావు

ఆత్మయే నిత్యమూ జీవితం సత్యమూ చేతలే నిలుచురా చిరకాలం

బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా

అభిమానం అనురాగం చాటేదీ

ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ

కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా

కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా

నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా

ఒకరిది కన్ను ఒకరిది చూపు

ఇరువురి కలయిక కంటి చూపు

ఒకరిది మాట ఒకరిది భావం

ఇరువురి కదలిక కదిపిన కథ

ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తియ్యగా

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా

ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా


అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా

ఆహా అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా

పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా

కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ

ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తియ్యగా

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా

ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా


ఆహా కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా

కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా

జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచి పోలేనుగా

మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలొ పదిలము కద

ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తియ్యగా

ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా

ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా

నువ్వు లేక అనాథలం

సాయిబాబా  సాయిబాబా
సాయినాథా  సాయిదేవా
సత్యం నిత్యం నీవే కావా
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
బాబా  ఓ  బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
బాబా  ఓ  బాబా


మా పాలి దైవమనీ మా దిక్కు నీవేననీ
కొలిచాము దినం దినం సాయి
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి
శ్రీరాముడైనా  శ్రీకృష్ణుడైనా
ఏ దైవమైనా  ఏ ధర్మమైనా
నీలోనే చూచాము సాయి
రావా  బాబా  రావా
రక్షా  దక్షా  నీవే కదా మా బాబా
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
బాబా  ఓ  బాబా


మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్థనలు చేశామయా నిన్నే
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా గురుగోవిందైనా
గురుద్వారమైనా  నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి
రావా  బాబా  రావా
రక్షా  దక్షా  నీవే కదా మా బాబా
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
బాబా  ఓ  బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం
బాబా  ఓ  బాబా


కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి
అల్లా సాయి మౌలా సాయి
అల్లా సాయి మౌలా సాయి
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డీ సాయి ఓం
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డీ సాయి ఓం
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి